
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కేంద్రం నియమించింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో 11 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీమ్ కోర్ట్ జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. అయోధ్య తీర్పు ఇచ్చిన 5 మంది జడ్జీల బెంచ్ లో ఆయన కూడా ఒకరు. జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బెలువాయిలో జన్మించారు. న్యాయ విద్య మంగళూరులో అభ్యసించి 1983 లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017 ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు.