
నూతన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా మొదటి సారి జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం సైనికదళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర ఉత్సవాలకు ఈ సంవత్సరం ముఖ్య అతిధిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పథ అల్ సిసి హాజరయ్యారు. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదిప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. గణతంత్ర ఉత్సవాల్లో ‘ఆత్మనిర్భర్’ క్రింద స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ ట్యాన్కులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.