“భారత్ రాష్ట్ర సమితి” పార్టీగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి

ఇంద్రధనుస్సు ప్రతినిధి, 6 ఆక్టోబర్ 2022 : భారత దేశం మొత్తం తమ పార్టీ కార్యకలాపాలను విస్తరించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు 5 అక్టోబర్ 2022 తేదీన టి ఆర్ ఎస్ పార్టీని “భారత్ రాష్ట్ర సమితి” పార్టీగా మారుస్తున్నట్లు హైదరాబాద్ లో ప్రకటించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవటానికి తమ నూతన బి ఆర్ ఎస్ పార్టీ ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన టి ఆర్ ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో చేసిన పేరు మార్పు తీర్మానం కాపీని ఎలక్షన్ కమీషన్ ఆఫీస్ నందు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *