
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయంలో కొత్తగా నిర్మించిన పరికర్మణా మార్గం శ్రీక్షేత్రం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలనే ధ్యేయంగా నూతన నిర్మాణాలు, మఠాలు, ఇతర ఆలయాల ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కారిడార్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ రోజు నుంచి 17 తేదీ వరకు ప్రారంభ వేడుకలు ఘనంగా జరపటానికి శ్రీక్షేత్రం పాలక మండలి, ఒడిస్సా ప్రభుత్వం చకా చకా ఏర్పాట్లు చేస్తున్నాయి. కారిడార్ ప్రారంభంతో భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.