

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజు ఉదయం 11-30 గంటలకు పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కాటా శ్రీనివాస గౌడ్ గారు మరియు వారి సతీమణి 15 వార్డు కౌన్సిలర్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధాశ్రీనివాస్ గౌడ్ వారి నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అమీనుపూర్ మండలానికి సంబంధించి చిరంజీవులు, వెంకటేశ్వర రావు తదితరులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రమేష్ యాదవ్, బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ సుధాకర్ యాదవ్, మనోహర్, అప్పారావు, మహేష్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణా యాదవ్, డి.ఎల్.వి.శ్రీనివాస్, శ్రీధర్, నాగేష్, గోపాల్ రెడ్డి, భిక్షపతి, చుక్కారెడ్డి, రామచంద్రా రెడ్డి, ఎల్లయ్య, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.