బిజెపిలో చేరిన బిసి నేత దేరంగుల ఉదయ్ కిరణ్! కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎ.పి బిజెపి సారథి పురందేశ్వరి!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, బిసి కులాల ఆశాజ్యోతి శ్రీ దేరంగుల ఉదయ్ కిరణ్ ను తమ పార్టీలో చేరవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఆహ్వానించింది! ఈ మేరకు 19 జూలై 2024 తేది శుక్రవారం రోజున బిజెపిలో చేరిన బిసి నేత దేరంగుల ఉదయ్ కిరణ్! కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎ.పి బిజెపి సారథి పురందేశ్వరి!! దేరంగుల ఉదయ్ కిరణ్ ఒక వ్యక్తి కాదు. బిసి కులాల హక్కుల కోసం పోరాటాలు చేసిన యోధుడు! రాష్ట్రవ్యాప్తంగా బిసి కులాల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్యల పరిష్కారం కొరకు మానవ హక్కుల కమీషన్ లో పిటిషన్లు దాఖలు చేసి, ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం దృష్టికి సమస్యలు వెళ్ళేలా చేయడంలో దిట్ట!! వీరి కార్యకలాపాలు చూసి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వారి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు, కొన్ని బహిరంగ సభల్లో దేరంగుల చేత మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా జగన్ గారిని విమర్శిస్తే ఒంటికాలిపై లేచి కౌంటర్ ఇచ్చే వాడు. వైఎస్ఆర్సీపీ కి బిసిల తరపున ముఖ్య నాయకుడుగా ఉండి, బిసి కులాల కార్పొరేషన్లు ఏర్పాటు కావటానికి తన వంతు పాత్ర పోషించాడు. ఇంత మంచి నాయకుడికి ఏ పార్టీ అయినా కోరిన పదవి ఇస్తుంది. దురదృష్టవశాత్తు అగ్ర కులాలకు చెందిన ఆ నలుగురి వలన దేరంగులకు ఏ పదవి రాకుండా అడ్డుకున్నారు. ముందు ఎమ్.ఎల్.సి ఇస్తామన్నారు. తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్నారు. అదీ ఇవ్వలేదు. మళ్ళీ టిటిడి ఛైర్మన్ పదవి బిసి కోటాలో ఇస్తామని చెప్పి సీఎంవో నుంచి ఫోన్ చేసి అమరావతికి పిలిపించి, ఆ పదవి కూడా రెడ్లకే ఇచ్చి మోసం చేశారు. పది సంవత్సరాలపాటు పార్టీ కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడితే చివరికి దగా చేశారు. ఒక సారి తెలంగాణ వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తుంటే ముఖ్యమంత్రిని సైతం పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్నాడని విమర్శించిన ధీశాలి!
బిసి కులాలకు మంచి చేయాలి అనే సంకల్పంతో జాతీయ బిసి సంఘం ఏర్పాటు చేసి,దానికి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న దేరంగుల చేస్తున్న పోరాట పటిమను మీడియాలోని వార్తల ద్వారా తెలుసుకున్న “అమెరికాలోని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమీషన్” దేరంగులకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. భారతదేశంలో వారి ప్రతినిధిగా కూడా నియమించుకున్నారు. సమస్యలపై చేసిన పోరాటాలకు గుర్తుగా ఎన్నో అవార్డులు దేరంగులను వరించాయి.

దేరంగుల ఉదయ్ కిరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా, గుంతకల్ వాస్తవ్యులు. బిసి వడ్డెర కులానికి చెందిన వారు. బిసి కులాల హక్కులతో పాటు, మంచి సామాజిక కార్యక్రమాలను అమలు చేయటంలో అగ్రగామిగా ఉన్నాడు. వీరు ఏ రాజకీయ పార్టీలో చేరితే, ఆ పార్టీకి కొండంత బలం చేకూరుతుంది.
దేరంగులను బిజెపి తమ పార్టీలోకి ఆహ్వానించడం శుభ పరిణామం!! బిసిల ఓట్లు బిజెపికి రావటానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఒక బలమైన బిసి నాయకుడిని బిజెపి చేర్చుకోవటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఎదగటానికి ఇది ఉపకరిస్తుంది. టిడిపి, బిజెపి, జనసేన కూటమికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *